Nellore: భిక్షాటన వదిలి బడి బాట.. మంత్రి చొరవతో అనాథల అక్షర గాథ!
Nellore: నెల్లూరులో మంత్రి నారాయణ చొరవతో 180 మంది అనాథ చిన్నారుల జీవితాల్లో వెలుగులు. భిక్షాటన వదిలి విద్యా పట్టాలు అందుకున్న వైనం.
Nellore: భిక్షాటన వదిలి బడి బాట.. మంత్రి చొరవతో అనాథల అక్షర గాథ!
Nellore: భిక్షాటన చేసే చిన్నారుల్లోనూ అక్షర కాంతి అద్భుతం చేసింది. అవును ఇదేదో మోటివేషనల్ స్టోరీ కాదు నెల్లూరులో జరిగిన యదార్థ సంఘటన ఆ స్కూల్ (VRC) చూసి, ఆ చిన్నారుల మనసు మారింది.. సార్ మమ్మల్ని ఆ బడిలోనే చేర్పించండి అంటూ ఆ చిన్నారులు అడిగిన తీరు చూసి, నగర కమిషనర్ వై.ఓ నందన్ హృదయం చలించిపోయింది.
అక్షరాల 'నారాయణీయం': కార్పొరేషన్ స్కూల్స్ చూసి ముగ్ధులైన వీధి బాలల నిజమైన కథ ఇది. చదువు ఉంటే సమస్తం ఉన్నట్టే, అనే మాటకు అక్షర సత్యం ఈ సంఘటన. భిక్షాటన వదిలి బడి బాట పట్టాలని, మంత్రి నారాయణ స్కూల్స్ పై మనసు పడ్డ అనాథ చిన్నారుల "అక్షర గాథ" ఇది అందమైన స్కూల్ భవనాలు చూశారు.. చదువుపై ఆశ పెంచుకున్నారు. చదవాలని చదువుకుంటామని చెప్పిన చిన్నారుల, చిన్ని హృదయాల్లోంచి పుట్టిన గొప్ప ఆశ మనసును హత్తుకునే మానవీయ సంఘటన ఇది....
కట్ చేస్తే..
అక్షర దివిటీలు అనాధ చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాయి.... భిక్షాటనల చీకటిని తరిమి తరిమి కొట్టాయి. నాడు భిక్షాటన చేసిన ఆ చేతుల్లో, నేడు చదువుల పట్టా వచ్చి చేరింది. నిన్న బస్టాండ్లో భిక్షాటన.. నేడు మంత్రి నారాయణ చొరవతో మెడలో మెడల్స్, చేతిలో పట్టా.
సహజంగా మనం ఇలాంటి సంఘటనలు సినిమాల్లో చూస్తుంటాం.. కథల్లో వింటుంటాం. కానీ ఇది మన కనుల ముందు సాక్షాత్కరించిన యదార్ధ సంఘటన. 5 రూపాయల బువ్వతో బతికిన ఆ చేతులకు.. మంత్రి నారాయణ అక్షరాయుధం ఇచ్చి, జీరో నుంచి నేడు హీరోలను చేశారు.
చిరిగిన బట్టలు తీసేసి.. మంత్రి నారాయణ పర్యవేక్షణలో నేడు సూటు-బూటుతో ఆ చిన్నారుల జీవితాల్లో మెరుపులు అద్దారు. చేయిచాచే స్థితి నుంచి, అవే చేతులతో మెడల్స్ అందుకునే స్థాయికి ఎదిగారంటే.. అది కేవలం చదువు వల్లనే సాధ్యమని మరోసారి నిరూపితమైంది.
మంత్రి నారాయణ పట్టుదల, ఆ చిన్నారుల చదువుపై ఆసక్తి , కలిసి నేడు ఒక గొప్ప మార్పును కళ్ళకు కట్టినట్టు చూపించాయి. దాదాపు 180 మంది అనాధ పిల్లలు, నగర కమిషనర్ వై.ఓ. నందన్ చేతుల మీదుగా పట్టాలు అందుకోవడం, కనుల పండుగ మాత్రమే కాదు ఇదో గొప్ప ప్రస్థానం. చీకటిలో నుండి వెలుగులోకి , అట్టడుగు నుంచి ఆకాశమే హద్దుగా సాగిన అనాథ పిల్లల ఓ సాహస యాత్ర.
అవకాశం ఉండి కూడా చదువును నిర్లక్ష్యం చేస్తే యువతకు ఈ చిన్నారుల జీవితం ఓ చెంపపెట్టు లా ఉంటుందనడంలో సందేహం లేదు.. ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే చదువుల నిచ్చెన ఎక్కి వెళ్లాల్సిందేనని, మరోసారి చదువు గొప్పతనాన్ని చెప్పిన చిన్నారులకు, గుర్తించి ప్రోత్సహించిన అధికారులకు, నాయకులకు మనం సెల్యూట్ చేయాల్సిందే!




