Nellore: పీ4లో సర్వేపల్లి సూపర్.. ఎమ్మెల్యే సోమిరెడ్డికి సీఎం ప్రశంసలు

Nellore: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమానికి CSR నిధులను అనుసంధానించి సర్వేపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపిన ఎమ్మెల్యే ని సీఎం అభినందించారు.

V. Narasimhulu, Nellore
Published on: 1 July 2026 10:56 AM IST
Nellore
X

Nellore: పీ4లో సర్వేపల్లి సూపర్.. ఎమ్మెల్యే సోమిరెడ్డికి సీఎం ప్రశంసలు

Nellore: పీ4లో సర్వేపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమంగా తీర్చిదిద్దడంపై ప్రశంసలు అందుకున్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 కార్యక్రమానికి సీఎస్ఆర్ నిధులు అనుసంధానించి సర్వేపల్లిలో రికార్డు స్థాయిలో కార్యక్రమాలు చేపట్టారు..

చిన్నారులకు 1841 సైకిళ్లు, గ్రామాల్లో సోలార్ వీధిలైట్లు, వాటర్ ప్లాంట్లు, గిరిజన కాలనీల దత్తత, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తదితర కార్యక్రమాలు చేపట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గిరిజనుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి పెట్టడం, వేలాది మందికి ఆధార్ కార్డులు ఇఫ్పించేందుకు చర్యలు చేపట్టడంపైనా ఆనందం వ్యక్తం చేశారు.

మంగళవారం రాత్రి ఉండవల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పీ4 కార్యక్రమాలతో పాటు సర్వేపల్లిలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన బుక్ లెట్ ను చంద్రబాబు నాయుడికి అందించారు సోమిరెడ్డి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీ4లో భాగంగా చేపట్టనున్న మరో 2 వేల సైకిళ్ల పంపిణీ, వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, సోలార్ వీధిదీపాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, హైస్కూళ్లను మోడల్ స్కూళ్లుగా అభివృద్ధి, హాస్పిటల్ నిర్మాణం, ముత్తుకూరు, కృష్ణపట్నం పంచాయతీల దత్తత- కోట్లాది రూపాయలతో ప్రగతి పనులు, తదితర కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వివరించారు శాసనసభ్యులు..

సర్వేపల్లి నియోజకవర్గంలో ఏపీ జెన్ కో, SEIL థర్మల్ పవర్ ప్లాంట్లు, అదానీ కృష్ణపట్నం పోర్టు, 11కి పైగా పామాయిల్ ఫ్యాక్టరీలు, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, విశ్వసముద్ర, కిసాన్ క్రాఫ్ట్ తదితర కంపెనీలు, ఆయా కంపెనీల ఏర్పాటుకు భూములు త్యాగం చేయడంతో పాటు వాటి నుంచి వెలువడుతున్న తీవ్రమైన కాలుష్యాన్ని భరిస్తున్న సర్వేపల్లి ప్రజలు,

వైసీపీ పాలనలో సొంత అవసరాలు, లాభాలను చూసుకుని సీఎస్ఆర్ నిధుల వినియోగాన్ని పూర్తిగా విస్మరించిన అప్పటి పాలకులను గుర్తు చేశారు.

ఎవరూ పట్టించుకోకపోవడంతో కంపెనీలన్నీ తమ సీఎస్ఆర్ నిధులను గుజరాత్ తో పాటు వివిధ ఉత్తరాది రాష్ట్రాల్లో వినియోగం కోసం, కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే సీఎస్ఆర్ నిధుల సద్వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సోమిరెడ్డి...కంపెనీల నుంచి వెలువడే కాలుష్యాన్ని భరిస్తున్న ఈ ప్రాంత ప్రజల కోసమే 75 శాతం నిధులను ఖర్చుపెట్టాలని పట్టు పట్టారని,

సోమిరెడ్డి ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించి, సహకరించడం ప్రారంభించిన కంపెనీలకు అభినందనలు తెలిపారు. తొలి ఏడాదిలోనే రూ.52 కోట్లకు పైగా సీఎస్ఆర్ నిధులతో వివిధ రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేయడం,

ప్రస్తుతం రూ34 కోట్లతో వివిధ పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారని,

ఇదే క్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో ప్రారంభమైన పీ4 కార్యక్రమానికి సీఎస్ఆర్ నిధులు అనుసంధానించి వందలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా సోమిరెడ్డి చర్యలు చేపట్టారని వివరించారు.

గతంలో గిరిజన గ్రామం మల్లికార్జునపురంను స్వయంగా దత్తత తీసుకున్న సోమిరెడ్డి..ప్రస్తుతం ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుని వారి బాధ్యతల స్వీకరించారని, పీ4లో భాగస్వాములై చిన్నారులకు అత్యుత్తమ విద్య అందిస్తున్న నందగోకులం..స్వర్ణభారత్ ట్రస్టు ద్వారానూ ప్రజలకు విద్య, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story