Marripadu: పల్లెపాడులో అక్రమ తవ్వకాలు.. వాహనాలు సీజ్!
Marripadu: నెల్లూరు జిల్లా పల్లెపాడు చెరువులో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్లను మర్రిపాడు ఎస్సై బలరామిరెడ్డి సీజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
Marripadu: పల్లెపాడులో అక్రమ తవ్వకాలు.. వాహనాలు సీజ్!
పల్లెపాడు: చెరువులో నుంచి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్న మర్రిపాడు ఎస్ఐ.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలతో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. మండల పరిధిలోని పల్లిపాడు చెరువులో జెసిబి లు ఉపయోగించి వందల ట్రాక్టర్లతో గ్రావెల్ ను ఎలాంటి అనుమతులు లేకుండా గత నెల రోజులుగా విచ్చలవిడిగా సుమారు ఏడు అడుగుల లోతుకు తవ్వి తరలిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం మేరకు మర్రిపాడు ఎస్సై బలరామిరెడ్డి తన సిబ్బందిని పంపించి గ్రావెల్ తోలుతున్న ట్రాక్టర్లను,జెసిబి ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని సుమారు 7 అడుగుల లోతు గ్రావెల్ ను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.




