Nellore: నెల్లూరులో ఘనంగా పవన్ కళ్యాణ్ 'రెండేళ్ల పాలన విజయోత్సవం'!

Nellore: పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 'రెండేళ్ల ప్రజా పాలన విజయోత్సవ సభ.

V. Narasimhulu, Nellore
Published on: 14 Jun 2026 3:02 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఘనంగా పవన్ కళ్యాణ్ 'రెండేళ్ల పాలన విజయోత్సవం'!

Nellore: డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి, రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, ఏఎంసీ డైరెక్టర్ గునుకుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ ఆంజనేయస్వామి ఆలయం వెనుక, చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా రెండేళ్ల పాలన విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ..

జిల్లాలో ప్రస్తుతం జనసేన పార్టీ నూతన కార్యవర్గాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ తరఫున ఎలాంటి అధికారిక చేరికల కార్యక్రమాలు నిర్వహించడం లేదని తెలిపారు. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయమే తమకు శిరోధార్యమని, ఆయన ఆదేశాలు, పార్టీ విధానాలకు అనుగుణంగానే ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

గత ఇరవై నాలుగు నెలలుగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతాయుత నాయకత్వంతో పనిచేస్తూ, చరిత్ర మరుగున పడిన ఎన్నో వర్గాలు, వంశాలు, సామాజిక వర్గాలకు గుర్తింపు తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. సమాజంలో సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జనసేన పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు.

జనసేన పార్టీ ఏ ఆశయాలతో, ఏ లక్ష్యాలతో స్థాపించబడిందో.. ఆ ఆశయాలకు కట్టుబడి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసిన సందర్భంగా ఈ వేడుకను నిర్వహించడం జరిగిందన్నారు. ఇది పూర్తిగా విజయోత్సవ సభ మాత్రమేనని, ఈ కార్యక్రమానికి హాజరైన కొంతమంది యువత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా వచ్చారని, వారిని ఈ వేడుకలో భాగస్వాములుగా చేస్తున్నామే తప్ప, అధికారిక చేరికలు చేపట్టడం లేదని స్పష్టం చేశారు.

రానున్న రోజుల్లో పార్టీ రాష్ట్ర నాయకత్వం మార్గదర్శకత్వంలో... నూతన కార్యవర్గ కమిటీలు ఏర్పడిన తర్వాత, పార్టీ బలోపేతానికి అవసరమైన కార్యక్రమాలు మరింత అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. యువత, మహిళలు, సామాజిక వర్గాలన్నింటినీ జనసేన కుటుంబంలో భాగస్వాములుగా చేసుకునే దిశగా కార్యాచరణ కొనసాగుతుందని పేర్కొన్నారు.

పార్టీ ప్రతినిధిగా తాను జనసేన పార్టీ విజయాలను, ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాలను, అలాగే పార్టీ ఆశయాలు, లక్ష్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సమాజ అభివృద్ధి, యువత భవిష్యత్తు, రాష్ట్ర ప్రగతి కోసం అంకితభావంతో పనిచేస్తానని కిషోర్ గునుకుల తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, వీరమహిళ మరియు ఏఎంసీ డైరెక్టర్ గునుకుల విజయలక్ష్మి, 16వ డివిజన్ నాయకులు నరహరి, విశ్వనాథ్, 21వ డివిజన్ నాయకుడు కుమార్, 29వ డివిజన్ నాయకుడు హేమచంద్ర యాదవ్, 2వ డివిజన్ నాయకులు నాగేంద్ర, బాలు, 18వ డివిజన్ నాయకుడు వర్షన్, జమీర్, ప్రశాంత్, 28వ డివిజన్ నాయకుడు బ్లూ బర్డ్ అధినేత వేముల శివకృష్ణ, యువ నాయకులు హర్ష, నవీన్, రాఘవ, 49వ డివిజన్ నాయకుడు కర్రెద్దుల అశోక్, 48వ డివిజన్ నాయకుడు చిత్తూరు బాలాజీ, నక్కల శివకృష్ణ, సురేంద్ర, మనోజ్, శివ, హరి, వీరమహిళలు భవాని, అమని, ప్రవళ్లికతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story