Nellore: శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ సోదరి
Nellore: నెల్లూరు మూలాపేట శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ సోదరి విజయదుర్గ.
Nellore: శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ సోదరి
Nellore: నెల్లూరు నగరంలోని మూలాపేట శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానములో శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరి విజయదుర్గ, వెంకటేష్ దంపతులు ఇన్ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెడ్. శివప్రసాద్ దంపతులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంభహారతుల కార్యక్రమములో పాల్గొన్నారు. ముందుగా ఛైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి, ట్రస్టుబోర్డు సభ్యులు, ప్రధాన అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తదుపరి అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టుబోర్డు కమిటీ ఛైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ , క్లస్టర్ ఇన్ఛార్జ్ భానుశ్రీ , కార్యనిర్వహణాధికారి వి. గిరికృష్ణ , ట్రస్టుబోర్డు కమిటీ సభ్యులు, 41వ డివిజన్ అధ్యక్షలు ఉచ్చూరు సురేష్, అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




