Penchalakona Brahmotsavam: పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు విశేషం.. బంగారు హనుమంత వాహనంపై భక్తులను అలరించిన నరసింహస్వామి!

Penchalakona Brahmotsavam: నెల్లూరు జిల్లా పెంచలకోనలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడవ రోజు రాత్రి స్వామివారు బంగారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

Arun Chilukuri
Published on: 30 April 2026 7:11 AM IST
Penchalakona Brahmotsavam
X

Penchalakona Brahmotsavam: పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు విశేషం.. బంగారు హనుమంత వాహనంపై భక్తులను అలరించిన నరసింహస్వామి!

రాపూరు (నెల్లూరు జిల్లా): నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో వెలసివున్న లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు రాత్రి స్వామివారు బంగారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన జయజయధ్వానాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ కోన ప్రాంతం పులకించిపోయింది. హనుమంతుడు భక్తికి, శక్తికి, నిస్వార్థ సేవకు మారుపేరు. లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపాన్ని సైతం హనుమంతుడు తన భక్తితో శాంతింపజేస్తాడని భక్తుల నమ్మకం.

ఈ వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల అహంకారం నశించి, మనశ్శాంతి లభిస్తుందని భక్తుల విశ్వాసం. పెంచలకోనలో బంగారు హనుమంత వాహనంపై స్వామివారని భక్తులు పూనీతులయ్యారు. విద్యుత్ దీపాల కాంతుల్లో, సువర్ణ కాంతితో మెరిసిపోతున్న వాహనంపై స్వామివారి దివ్యమంగళ స్వరూపం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. మంగళవాయిద్యాలు, చెక్కభజనలు, కోలాటాల నడుమ స్వామివారి ఊరేగింపు ఆలయ మాడ వీధుల్లో సాగింది. భక్తులు అడుగుడుగునా నీరాజనాలు పట్టి, గోవింద నామస్మరణతో స్వామివారిని పూజించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు,వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story