Rapur: పెంచలకోనలో వైభవంగా నృసింహ యాగం
Rapur: రాపూరు మండలం పెంచలకోన శ్రీ పెనుశీల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వైభవంగా నృసింహ యాగం. వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు.
Rapur: పెంచలకోనలో వైభవంగా నృసింహ యాగం
రాపూరు: నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెంచలకోన శ్రీ పెనుశీల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నృసింహ యాగం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.ఆలయ అర్చకులు,వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
యాగంలో భాగంగా స్వామివారికి విశేష అభిషేకాలు,అర్చనలు నిర్వహించి,వేద మంత్రోచ్ఛారణల మధ్య నృసింహ యాగాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
యాగం విజయవంతంగా సాగాలని, భక్తులపై స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని వేద పండితులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
Next Story




