Penchalakona: మూడవ శనివారం భక్తులతో పోటెత్తిన పెంచలకోన పుణ్యక్షేత్రం

Penchalakona: ప్రకృతి ఒడిలో వెలసిన పెంచలకోన లక్ష్మీనృసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రమైంది.

V. Narasimhulu, Nellore
Published on: 23 May 2026 8:07 PM IST
Penchalakona
X

Penchalakona: మూడవ శనివారం భక్తులతో పోటెత్తిన పెంచలకోన పుణ్యక్షేత్రం

Penchalakona: ప్రకృతి ఒడిలో, పచ్చని అడవుల మధ్య వెలసిన ఆధ్యాత్మిక క్షేత్రం పెంచలకోన, తెల్లవారుజాము నుంచే ఈ క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది శ్రీ పెనుశిల లక్ష్మీనృసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం వచ్చే మూడవ శనివారం కావడంతో,వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు,గోవింద నామస్మరణ తో కోన పరిసరాలు మార్మోగియి.

తెల్లవారుజామునుంచే భక్తులు పవిత్రమైన కోనేరులో స్నానాలు ఆచరించి అనంతరం తడిబట్టలతోనే స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు,ఈ మూడవ శనివారం నాడు స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నమ్మకంతోనే వృద్ధులు, మహిళలు, చిన్నారులు సైతం ఎండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి వేచి ఉన్నారు.

కష్టాల్లో ఉన్నప్పుడు పెంచలకోన స్వామిని స్మరిస్తే చాలు,ఆపదలను తొలగించి కాపాడతాడు,అని భక్తులు భక్తిపారవశ్యంతో చెబుతున్నారు,కొండకోనలను దాటుకుంటూ భక్తులు నృసింహస్వామివారిని దర్శించుకుని,తరించారు,ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story