Nellore: ముగిసిన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

Nellore: నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.

V. Narasimhulu, Nellore
Published on: 2 May 2026 6:31 PM IST
Nellore
X

Nellore: ముగిసిన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

Nellore: కోలాటాలు.. కులుకు భజనలు తప్పెట్ల దరువులు భక్తుల అడుగులు.. పసుపు కుంకుమల పారాయణాలు.. తో శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం అనంతరం వసంతోత్సవం కనులవిందు గా సాగింది. ఆలయ ధర్మకర్తల మండలి ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ తో పాటు, నెల్లూరు దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ సంచాలకులు జనార్దన్ రెడ్డి, అర్చక బృందంతో కలిసి ఆడారు, పాడారు, స్వామివారి ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమయ్యారు.

వారం రోజుల పాటు సాగిన శ్రీ పెనుజుల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకలు సందర్భంగా కోన జనసంద్రమైంది ఇసుకేస్తే రాలనంతగా భక్త ప్రవాహం కొనసాగింది. వసంతోత్సవంలో తాము సైతం అంటూ ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన అనేకమంది భక్తులు,

స్వామి శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అశేషంగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీస్ యంత్రాంగం, అడుగడుగున రక్షణ చర్యలు చేపట్టింది. దీంతో స్వామివారి ఉత్సవాల కళ్యాణోత్సవం.. వసంతోత్సవాల ఘట్టం ఘనంగా ముగిసింది.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story