Nellore: నెల్లూరులో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు!

Nellore: నెల్లూరు 16వ డివిజన్‌లో ఏఎంసీ డైరెక్టర్ గునుకుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

A Praveen, Nellore
Published on: 18 Sept 2026 10:18 AM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు!

Nellore: ఘనంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదిన వేడుకలు ఆంజనేయస్వామి ఆలయంలో దీపాలు వెలిగించి కేక్ కట్ చేసిన ఏఎంసీ డైరెక్టర్ గునుకుల విజయలక్ష్మి

నెల్లూరు నగరంలోని 16వ డివిజన్‌లో ఏఎంసీ డైరెక్టర్ గునుకుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయంలో మహిళలు, డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆలయంలో దీపాలు వెలిగించి ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ చేస్తున్న సేవలను వారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గునుకుల విజయలక్ష్మితో పాటు డివిజన్ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore