Podalakuru: వుడాస్స్ పేటలో ఇందూ జ్ఞాన వేదిక ఆధ్యాత్మిక సదస్సు!
Podalakuru: సంగం మండలంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో భగవద్గీత ప్రచారం నిర్వహించారు. జూలై 29న గురు పౌర్ణమి విశేషాలను భక్తులకు వివరించారు.
Podalakuru: వుడాస్స్ పేటలో ఇందూ జ్ఞాన వేదిక ఆధ్యాత్మిక సదస్సు!
పొదలకూరు: శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారి దివ్య ఆశీస్సులతో ఈ నెల జూలై 29 వ తేదీ న రానున్న గురు పౌర్ణమి పండుగ ను పురస్కరించుకుని "త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక" పొదలకూరు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు జిల్లా, సంగం మండలంలోని వుడాస్స్ పేట, తరునాయి, అమరపు నాయుడు కండ్రిక గ్రామాల్లో త్రైత సిద్ధాంత భగవద్గీత మరియు అనుబంధ గ్రంథాల ప్రచారం జరిగింది.
గురువు* "గు"ణాతీతుడు అలాగే "రూ"పవర్జితుడు , గుణముల మలినం లేదు అలాగే రూపంలేదు కాబట్టి ఆయనను "గురు" అని అన్నారు.ఇంకా"గుండ్రము అను పదము నుండి పుట్టిన పదమే గురువు" అని చెప్పవచ్చు. ఆది మద్యాంత రహితుడైన పరమాత్మ భూమి పై భగవంతుడు (శ్రీకృష్ణుడు) గా జన్మిస్తే ఆయనను గురువు అని అంటాము.పూర్వము "గురువు గుండ్రాయి లాంటి వాడు" సామెత గా అనెడి వారు , ఆది అంతము లేని గుండ్రాయి కూడా మొదలు చివర అనేవి ఉండవు కాబట్టి అలా పోల్చారు.
దేవుడే మనిషి జన్మిస్తే ఆయనను మాత్రమే గురువు అని అనాలి.ఆషాడ మాసం లో చంద్రుడు గుండ్రం గా పెద్ద గా ఉండుట వలన గురు పౌర్ణమి గా నిర్ణయించి సాక్షాత్తు శ్రీ కృష్ణుడు ని మాత్రమే జగద్గురువు గా భావించి గురు పూజ చెయ్యాలి అని తెలియజేశారు.
కార్యక్రమంలో త్రైతసిద్ధాంతం-ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక - పొదలకూరు కమిటీ అధ్యక్షుడు , సభ్యులు పెంచలనరసయ్య గారు, మధు, కిషోర్
పెంచలయ్య, వరలక్ష్మమ్మ, పద్మమ్మ, శిరీష లు పాల్గొన్నారు.




