Podili: పొదిలిలో రూ. 15 కోట్ల బ్రహ్మంగారి గుడి భూమి కబ్జా!
Podili: పొదిలి శివాలయం వద్ద గల బ్రహ్మంగారి గుడి స్థలాన్ని ఆక్రమించి, దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పీజీఆర్‌ఎస్ (PGRS) లో జిల్లా కలెక్టర్‌కు భక్తుడి ఫిర్యాదు.
Podili: పొదిలిలో రూ. 15 కోట్ల బ్రహ్మంగారి గుడి భూమి కబ్జా!
Podili: మార్కాపురంజిల్లా పొదిలి పట్టణం స్దానిక శివాలయం వద్ద ఉన్న బ్రహ్మంగారి గుడి స్దలాన్ని కొందురు ఆక్రమంగా ఆక్రమించారని పిజిఆర్ ఎస్ లో జిల్లా కలెక్టర్ కు పొదిలికి చెందిన ఆకుపాటి లక్ష్మణ అనే భక్తుడు ఫిర్యాదు చేశాడు.భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు కుడా వీలులేకుండా ఆక్రమించి ఆక్రమ రిజిష్టేషన్ చేసుకొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. స్దానిక అధికారులకు పలుసార్లు ఫిర్యాదులు చేసిన ఎవ్వరు పట్టించుకొవడం లేదని ఆయన ఆరొపించాడు.
కాళ్ళుపట్టుకుంటుమన్న కనికరించడంలేదని దాదాపు 15 కొట్ల రూపాయల విలువైన ఆస్దిని ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొన్నారని తెలిపారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి బ్రహ్మంగారి గుడికి సంబందించిన కొట్ల రూపాయల విలువైన స్దలాన్ని భూ కబ్జదారులనుండి విడిపించాలని ఆయన కొరారు.




