Nellore: నెల్లూరులో ‘పల్లె నిద్ర’ అవగాహన కార్యక్రమాలు

Nellore: నెల్లూరులో ‘పల్లె నిద్ర’ కార్యక్రమాల ద్వారా పోలీసులు సైబర్ నేరాలు, భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

V. Narasimhulu, Nellore
Published on: 29 April 2026 11:30 AM IST
Nellore
X

Nellore

Nellore: నెల్లూరు జిల్లాలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమాలను పోలీసులు విస్తృతంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు గ్రామాల్లో పోలీస్ అధికారులు ప్రత్యక్షంగా పాల్గొని ప్రజలతో సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద కాల్స్ లేదా వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే 112 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ‘డిజిటల్ అరెస్ట్’ వంటి మోసాలపై ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు.

అక్రమ, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసిన పోలీసులు, మహిళలు మరియు బాలల భద్రతపై గ్రామస్తుల్లో చైతన్యం పెంపునకు పలు సూచనలు చేశారు. పిల్లల విద్యపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రోత్సహించారు.

పోలీసు–ప్రజల మధ్య విశ్వాసం పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story