Atmakur: పోలీసుల పల్లెనిద్ర.. నేరరహిత గ్రామాలే లక్ష్యం!

Atmakur: నెల్లూరు జిల్లా యాకర్లపాడులో ఆత్మకూరు సిఐ గంగాధర్ పల్లెనిద్ర. దొంగతనాలు, సైబర్ నేరాలు, బెట్టింగ్‌లపై గ్రామస్తులకు అవగాహన.

M Satya Peter, Atmakur
Published on: 22 April 2026 6:11 AM IST
Atmakur
X

Atmakur: పోలీసుల పల్లెనిద్ర.. నేరరహిత గ్రామాలే లక్ష్యం!

Atmakur: నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాలతో ఆత్మకూరు డీఎస్పీ కే. వేణుగోపాల్ పర్యవేక్షణలో వారి సూచనలతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు నేరాల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా అనంతసాగరం మండలం యాకర్లపాడు గ్రామంలో పల్లెనిద్ర నిర్వహించిన ఆత్మకూరు సిఐ గంగాధర్. వీరితోపాటు అనంతసాగరం, సోమశిల ఎస్సైలు సూర్య ప్రకాష్ రెడ్డి, అనూష లు పాల్గొన్నారు.

పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా అనంతసాగరం మండలం యాకర్లపాడు గ్రామంలో సీఐ గంగాధర్ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి వేసవి కాలంలో గ్రామాలలో జరిగే దొంగతనాలు అపరిచితుల సంచారం పై దృష్టి సారించాలని సైబర్ నేరాలపై అవగాహన కలిగి క్రికెట్ బెట్టింగ్, కోడిపందాల, పేకాట వంటి వాటి జోలికి వెళ్ళవద్దని సూచించారు.

గ్రామంలో అపరిచితుల సంచారం పై సమాచారం ఇవ్వాలని చిన్న చిన్న విషయాలలో గ్రామంలో గొడవలు పెట్టుకుని వివాదాలు చేసుకోవద్దని సూచించారు.. అలాగే యాకర్లపాడు హైవే వద్ద నాలుగు రోడ్లు కలిసి జంక్షన్ లో దాతల సహకారంతో టవర్ లైటింగ్ ఏర్పాటు చేశారు.. గతంలో ఈ ప్రాంతంలో చీకటిగా ఉండి ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో సీఐ గంగాధర్ ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామస్తుల సహకారంతో లైటింగ్ ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితోపాటు స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

M Satya Peter, Atmakur

M Satya Peter, Atmakur

Next Story