Nellore: నెల్లూరులో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న పొంగూరు రమాదేవి!

Nellore: నగరంలోని 21వ డివిజన్‌లో దేవీ శరన్నవరాత్రి పర్వదినాన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న పొంగూరు రమాదేవి. ప్రజల సమస్యలు, ప్రచార తీరును ఆప్యాయంగా ఆరా తీసిన వైనం.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 14 Oct 2026 11:20 AM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న పొంగూరు రమాదేవి!

Nellore: దేవీ నవరాత్రుల పవిత్ర వేళ, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి తమ నివాసానికి విచ్చేయడం ఎంతో ఆనందాన్ని, గౌరవాన్ని కలిగించిందని, ఈ పవిత్ర సందర్భంలో అమ్మవారే మా ఇంటికి విచ్చేసినట్లుగా భావిస్తూ ఎంతో సంతోషిస్తున్నామని చెప్పారు నగర 21వ డివిజన్ ప్రజలు...

ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున 21వ డివిజన్‌లో కొనసాగుతున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన, ప్రచారం జరుగుతున్న తీరు, స్థానిక ప్రజల సమస్యల గురించి ఆప్యాయంగా ఆరా తీశారు.

ఎంతో ఓర్పు, సహనం, ఆత్మవిశ్వాసంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, మహిళా శక్తికి ప్రతీకగా నిలుస్తున్న పొంగూరు రమాదేవి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా, కుటుంబ బాధ్యతలతో పాటు సామాజిక, ప్రజాసేవా కార్యక్రమాల పట్ల చూపుతున్న ఆసక్తి, అంకితభావం మహిళల శక్తిసామర్థ్యాలకు నిదర్శనంగా నిలుస్తున్నారు.

ఇంటింటికి విచ్చేసి ఆప్యాయంగా పలకరించి, ప్రచార కార్యక్రమాల గురించి తెలుసుకున్న పొంగూరు రమాదేవి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని చెప్పారు. ఈ పవిత్ర నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ఆమెకు, వారి కుటుంబానికి, ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE