Rapur: ఆంజనేయపురం అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ్ మాసోత్సవాలు!

Rapur: నెల్లూరు జిల్లా రాపూరు పరిధిలోని ఆంజనేయపురం అంగన్‌వాడీ కేంద్రంలో 'పోషణ్ మాసొత్సవాలు'. ఆహార నాణ్యత, పరిశుభ్రతపై తల్లిదండ్రులకు అవగాహన.

Yellayya, Nellore
Published on: 23 Sept 2026 10:52 AM IST
Rapur
X

Rapur: ఆంజనేయపురం అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ్ మాసోత్సవాలు!

Rapur: పోషణ్ మాసోత్సవాలలో భాగంగా సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహించే ప్రోగ్రామ్‌లలో భాగంగా మండల సిడిపిఓ డి. శారదాంబ ఆదేశాల మేరకు ఆంజనేయపురం అంగన్‌వాడీ కేంద్రంలో సమాజ భాగస్వామ్యం, జవాబుదారీతనం అనే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సెంటర్ వంటకాలపై, పిల్లల హాజరు శాతంపై, అలాగే ఆహార నాణ్యత, పరిశుభ్రతపై సెక్టార్ సూపర్‌వైజర్ బి. రాధిక తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వివరించారు. మెనూ ప్రకారం వంట చేయాలని, అంగన్‌వాడీ భోజనం ఇంటి భోజనంతో సమానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్ పి. రమాదేవి, స్థానిక తల్లులు, కిశోర బాలికలు పాల్గొన్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore