Nellore: సూపర్ సిక్స్ హామీలతో పాటు 99% వాగ్దానాలు పూర్తి ప్రశాంతి రెడ్డి

Nellore: నెల్లూరు జిల్లా కోవూరు నగర పంచాయతీ 16వ వార్డులో ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచారం జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 July 2026 8:44 PM IST
Nellore
X

Nellore: సూపర్ సిక్స్ హామీలతో పాటు 99% వాగ్దానాలు పూర్తి ప్రశాంతి రెడ్డి

నెల్లూరు: నెల్లూరు జిల్లా కోవూరు నగర పంచాయతీ పరిధిలోని 16వ వార్డులో నిర్వహించిన 'రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

స్థానికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకున్నామో వివరించేందుకే 'రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలతో పాటు దాదాపు 99 శాతం వాగ్దానాలను రెండేళ్లలోనే అమలు చేశామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి,ఇంత మల్లారెడ్డి,పెన్న డెల్టా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి,చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story