Naidupeta: నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు దగ్ధం!
Naidupeta: నాయుడుపేట-చెన్నై జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు.. 19 మంది ప్రయాణికులు సురక్షితం, తప్పిన ప్రమాదం.
Naidupeta: నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు దగ్ధం!
Naidupeta: నాయుడుపేట–చెన్నై జాతీయ రహదారి 16పై పెనుప్రమాదం తృటిలో తప్పింది.. తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఓజిలి–రాచపాళెం చెరువు కల్వర్టు సమీపంలో, చెన్నై వైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
కామాక్షి ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన AR 01 S 6404 నంబర్ గల బస్సు, 19 మంది ప్రయాణికులతో రేపల్లె నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నట్లు తెలుస్తోంది.
బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును నిలిపివేసి, ప్రయాణికులతో పాటు ఇతర సిబ్బందిని సురక్షితంగా కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ప్రయాణికులను మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు.




