Singanapalli: ప్రైవేటు బస్సు బోల్తా.. పలువురికి గాయాలు
Singanapalli: నెల్లూరు జిల్లా సింగనపల్లి సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో ఐదుగురు గాయపడి ఆసుపత్రికి తరలించారు.
Singanapalli
Singanapalli: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలో 565 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్ర మత్తు లోకి జారుకోవడంతో ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదు మందికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం బద్వేలు ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్ నుండి శ్రీ సత్య సాయి జిల్లాకు కార్మికులతో వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




