Nellore: కలువాయిలో పల్స్ పోలియో షురూ.. చిన్నారులకు చుక్కలు వేసిన టీడీపీ నేత రఘురామిరెడ్డి!
Nellore: నెల్లూరు జిల్లా కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
Nellore: కలువాయిలో పల్స్ పోలియో షురూ.. చిన్నారులకు చుక్కలు వేసిన టీడీపీ నేత రఘురామిరెడ్డి!
కలువాయి (నెల్లూరు జిల్లా): నెల్లూరు జిల్లా కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చల్లా రఘురామిరెడ్డి పాల్గొని ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, పోలియో నిర్మూలనకు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ఎంతో అవసరమని, ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తామని తెలిపారు.
తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం చల్లా రఘురామిరెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్య శాఖ చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజలు, చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




