Kaluvaya: రేపటి నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో చుక్కల పంపిణీ!
Kaluvaya: నెల్లూరు జిల్లా కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జూన్ 28 నుండి మూడు రోజుల పాటు పోలియో కార్యక్రమంవైద్యాధికారులు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు
Kaluvaya: రేపటి నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో చుక్కల పంపిణీ!
కలువాయి: నెల్లూరు జిల్లా కలువాయి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో పై వైద్యాధికారులు విజయలక్ష్మి, ఆశ్రీత విలేకర్ల సమావేశం నిర్వహించారు, ఈ సందర్బంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ జూన్ 28 నుండి 3రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు.
కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇప్పటి వరకు ఐదేళ్లలోపు మొత్తం 1,857 మంది చిన్నారులను గుర్తించామన్నారు.
వారందరికీ పోలియో చుక్కలు అందించేందుకు 16 పోలియో కేంద్రాలు, ఒక ట్రాన్సిట్ బూత్, ఒక మొబైల్ బూత్ ఏర్పాటు చేశామని తెలిపారు, 28వ తేది ఆదివారం,బూత్ లో పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని 29, 30వ తేదీన పోలియో చుక్కలు వేయించుకొని పిల్లలకి ఇంటింటికి తిరిగి.
మా సిబ్బంది పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు,పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు.
ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ఆరోగ్య శాఖకు సహకరించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
అనంతరం బస్టాండ్ సెంటర్ లో మానవహారం నిర్వహించారు, ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బంది ఆశ వర్కర్లు, పాల్గొన్నారు




