Nellore: ఈజిప్ట్‌లో భారత వ్యాపార ప్రతినిధి బృందంతో ఎంపీ బీద మస్తాన్‌రావు పర్యటన!

Nellore: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఈజిప్ట్ పర్యటనకు వెళ్లిన భారత వ్యాపార ప్రతినిధి బృందంలో రాజ్యసభ సభ్యులు, బీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ డా. బీద మస్తాన్‌రావు యాదవ్ పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE
Updated on: 18 Nov 2026 11:55 AM IST
Nellore
X

Nellore: ఈజిప్ట్‌లో భారత వ్యాపార ప్రతినిధి బృందంతో ఎంపీ బీద మస్తాన్‌రావు పర్యటన!

Nellore: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నేతృత్వంలో, FICCI మరియు భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన భారత వ్యాపార ప్రతినిధి బృందం ఈజిప్ట్ పర్యటనలో రాజ్యసభ సభ్యులు, బీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ డా. బీద మస్తాన్‌రావు యాదవ్ పాల్గొన్నారు. నవంబర్ 14 నుంచి 17 వరకు జరిగిన ఈ పర్యటన భారత్–ఈజిప్ట్ మధ్య వాణిజ్య, పారిశ్రామిక మరియు పెట్టుబడుల సంబంధాల విస్తరణ లక్ష్యంగా జరిగింది.

కైరోలోని భారత రాయబార కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ , ఈజిప్ట్‌లో భారత రాయబారి సురేష్ కె. రెడ్డి తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్, ఈజిప్ట్ జూనియర్ బిజినెస్‌మెన్ అసోసియేషన్ల మధ్య ద్వైపాక్షిక వ్యాపార సహకార ఒప్పందం కుదిరింది.

ఈ పర్యటనలో సూయజ్ కెనాల్ ఎకనామిక్ జోన్ సందర్శన, ఇండియా–ఈజిప్ట్ బిజినెస్ ఫోరం, జాయింట్ బిజినెస్ కౌన్సిల్ సమావేశం, GAFI, ఆఫ్రెక్సింబ్యాంక్ మరియు ఈజిప్ట్ వ్యాపార ప్రముఖులతో సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

ఆక్వాకల్చర్, రొయ్యల ఉత్పత్తి, సీఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతులు, ఆక్వా ఫీడ్ తయారీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు అంతర్జాతీయ మార్కెటింగ్ రంగాల్లో ఇరు దేశాల మధ్య వ్యాపార భాగస్వామ్యాలు, పెట్టుబడులు మరియు సాంకేతిక సహకార అవకాశాలను డా. బీద మస్తాన్‌రావు యాదవ్ చర్చించారు.

ఈ పర్యటన ద్వారా భారతీయ సీఫుడ్ పరిశ్రమకు కొత్త అంతర్జాతీయ మార్కెట్లు, సాంకేతిక భాగస్వామ్యాలు మరియు పెట్టుబడుల అవకాశాలు ఏర్పడతాయని, భారత్–ఈజిప్ట్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత వ్యాపార ప్రతినిధి బృందం ఫిక్కీ వారి సహకారంతో మరియు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారి నేతృత్వంలో ఇటలీ లోగల రోమ్ లో మూడు రోజులపాటు నిర్వహించే సమావేశాలల్లో పాల్గొనేందుకు బయలుదేరారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE