Nellore: కుటుంబ ఆస్తి వివాదానికి రాజకీయం రంగు పులమొద్దు
Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలం వెంకటేశ్వరపురంలో జరిగిన ఆస్తి వివాదంపై రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు.
Nellore: కుటుంబ ఆస్తి వివాదానికి రాజకీయం రంగు పులమొద్దు
Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలం వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి తమ కుటుంబాల మధ్య ఉన్న ఆస్తివివాదాన్ని రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపించారు.. పూర్తి వివరాలు ఈ విధంగా గ్రామంలో తమకు తమ బంధువులకు మధ్య గత పాతికేళ్లుగా భూవివాదం నడుస్తుందని దానిపై తాము రెండు వర్గాలు అధికారులను ఆశ్రయించి వారి నుండి స్పందన లేకపోవడంతో లోకాయుక్తకు ఆశ్రయించానని.
ఈ క్రమంలో కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని ఈ క్రమంలో దానిని అనుసరించి కోర్టు ఉత్తర్వులను పాటించాలని తాను అధికారులను కోరామని తెలిపారు.. కానీ తమ ప్రత్యర్థులుగా ఉన్న వారు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన సోషల్ మీడియా కు చెందిన శిల్పారెడ్డి అనే మహిళ కుటుంబాల మధ్య ఉన్న ఆస్తివివాదాన్ని రాజకీయ రంగు పులిమి వైయస్సార్ సిపి పార్టీ నాయకులను రంగ ప్రవేశం చేస్తూ స్థానిక తెలుగుదేశం నేతలు,
నియోజకవర్గానికి చెందిన మంత్రిపై నిందలు వేయడం సరికాదని తెలిపారు.. తమ ఆస్తివాదాలకి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్థానిక తెలుగుదేశం నేత బాణాల.శ్రీనివాసుల రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ఇది కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు తీర్పును అనుసరించి మాత్రమే తాము చర్యలకు కోరుతున్నామని తెలిపారు. తమ ప్రత్యర్థులు కూడా కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా పరిష్కరించుకోవాల్సిన వివాదం ఇది అని దీనికి రాజకీయ నాయకులు సంబంధం లేదని తెలిపారు.




