Nellore: కోటూరుపాడు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Nellore: నెల్లూరు జిల్లా రాపూరు గిరిజన ప్రభుత్వ హాస్టల్ వద్ద గుర్తుపట్టలేనంతగా కుళ్ళిపోయిన ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

V. Narasimhulu, Nellore
Published on: 20 May 2026 1:44 PM IST
Nellore
X

Nellore: కోటూరుపాడు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

నెల్లూరు: రాపూరు గిరిజన ప్రభుత్వ హాస్టల్ వద్ద ఓ గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపుతోంది. సుమారు 40నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్కుడైన వ్యక్తి మృతదేహం గుర్తుపట్టలేనంతగా కుళ్ళిపోయింది. ఇవాళ స్థానికులు కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు

మృతుడి శరీరంపై ఉన్న వస్త్రాలు.. మిగిలిన కొన్ని ఆనవాళ్లను బట్టి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై తిరుమల రావు చెప్పారు. డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి శవమై కనిపించడం కోటూరుపాడు స్థానికులను కొంత భయాందోళనకు గురిచేస్తోంది. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story