Rapur: ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం భగ్నం!

Rapur: నెల్లూరు జిల్లా రాపూరులో కుటుంబ కలహాలతో ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాలతో కాపాడారు.

Yellayya, Nellore
Published on: 14 July 2026 4:44 PM IST
Rapur
X

Rapur: ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం భగ్నం!

​రాపూరు: నెల్లూరు జిల్లా ​రాపూరు పట్టణంలోని అరుంధతివాడలో కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన మల్లవరం లక్ష్మి (34) తన ఇద్దరు కుమార్తెలు కార్తిక (10), కావ్య (7)తో కలిసి ఆత్మహత్యాత్నానికి పాల్పడింది.

స్థానికులు 112 కి కాల్ చేయగా రాపూరు పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, ఇంటి కిటికీ రేకులు తొలగించి లోపలికి ప్రవేశించి ముగ్గురిని సురక్షితంగా రక్షించారు.పోలీసుల వేగవంతమైన స్పందనతో ముగ్గురు ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రాపూరు పోలీస్ వారి సేవలను అభినందించారు.

Yellayya, Nellore

Yellayya, Nellore

Next Story