Nellore: రాపూరు లో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు మండలం సైదాదుపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
Nellore: రాపూరు లో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
నెల్లూరు: రాపూరు మేజర్ పంచాయతీలోని సైదాదుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాపూరు మండల అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి లబ్ధిదారుల ఇంటింటికి తిరిగి, స్వయంగా పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చెన్ను అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ....
విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు ఎలా మారుతుందో చెప్పడానికి చంద్రబాబు నాయుడు నిదర్శనం అన్నారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథంలోకి తెచ్చేందుకు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్నా, అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించాలన్నా.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకూ నీరివ్వాలన్నా, అది కేవలం అనుభవజ్ఞుడైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమవుతుందని చెప్పారు. ఆయన చేతులు బలోపేతం అయితేనే మన పిల్లల భవిష్యత్తు,మన రాష్ట్ర భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారు.
కులమతాలకు,రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధి యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్దాం అని, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మరింత బలపరుద్దాం అని పిలుపునిచ్చారు... నవ్యాంధ్రప్రదేశ్‌ను, అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్ల వడ్ల వెంకటరమణారెడ్డి,బత్తిన శ్రీహరి రెడ్డి, చిలకం ప్రసాద్ రెడ్డి,చెన్ను పెంచల్ రెడ్డి,చంద్రమౌళి,మోహన్,కూకటి పెంచలయ్య,కూని పోగు కన్నయ్య,సికిందర్, చిలువూరు రవణమ్మ, ఏటూరు నాగభూషణ్ రెడ్డి,మాలేపాటి వెంకటరమణ రెడ్డి,అహ్మద్,గుర్రాల వెంకటేశ్వర్లు,మల్లయ్య, సమయం ప్రసాద్,తదితర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




