Rapur: రాపూరు మండలంలో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం

Rapur: ఈనెల 28న జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాపూరు మండలం వేపినాపి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ప్రమీల రాజకుమారి పిలుపునిచ్చారు.

V. Narasimhulu, Nellore
Published on: 23 Jun 2026 8:50 PM IST
Rapur
X

Rapur: రాపూరు మండలంలో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం

Rapur: ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం వేపినాపి ప్రాథమిక ఆరోగ్యకేద్రంలో జరిగిన, పల్స్ పోలియో శిక్షణ కార్యక్రమంలో.. 0-5 సంవత్సరాలు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని, వేపినాపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రమీల రాజకుమారి తెలుపుతూ..

మండలం మొత్తం మీద, 3100 మంది ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు ఉన్నారని, మండలం మొత్తం మీద 30 పోలియో బూతు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ప్రయాణంలో ఉండే పిల్లలకు పోలియో చుక్కలు వేయించుటకు, ఆర్టీసీ బస్టాండ్ నందు కూడా పోలియో చుక్కల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని,

తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి, పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు... ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ సూర్య, ధర్మేంద్ర, డాక్టర్ భాను, ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story