Rapur: రాపూరు బిట్-1 ఎంపీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మురళీమోహన్ విజయం
Rapur: నెల్లూరు జిల్లా రాపూరు బిట్-1 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వేటూరి మురళీమోహన్ రెడ్డి ఘన విజయం. పాపకన్ను మధుసూదన్ రెడ్డిని కలిసి సత్కారం.
Rapur: రాపూరు బిట్-1 ఎంపీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మురళీమోహన్ విజయం
రాపూరు: నెల్లూరు జిల్లా రాపూరు మండలం రాపూరు బిట్-1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేటూరి మురళీమోహన్ రెడ్డి ఘన విజయం సాధించారు.
ఈ సందర్భంగా సోమవారం సంక్రాంతిపల్లిలోని పాపకన్ను గార్డెన్స్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యులు పాపకన్ను మధుసూదన్ రెడ్డిని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా విజయం సాధించిన వేటూరి మురళీమోహన్ రెడ్డికి పాపకన్ను మధుసూదన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. అలాగే ఎన్నికల్లో ఆయన గెలుపునకు కృషి చేసిన స్థానిక నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ శ్రేణుల సమష్టి కృషి, నాయకులు, కార్యకర్తల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. విజయం సాధించిన మురళీమోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.




