Rapur: రాపూరులో 9, 11, 12 వార్డుల వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు

Rapur: నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ 9, 11, 12 వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మల్లవరం అక్సా, బొజ్జ పెంచలయ్య, నల్లగళ్ల విమల నామినేషన్లు దాఖలు.

Yellayya, Nellore
Published on: 23 Nov 2026 4:39 PM IST
Rapur
X

Rapur: రాపూరులో 9, 11, 12 వార్డుల వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు

రాపూరు: నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ పరిధిలోని 9, 11, 12 వార్డులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. అరుంధతివాడకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు నల్లగల్ల శంకర్, మాతంగి మోషే ఆధ్వర్యంలో 11వ వార్డు అభ్యర్థిగా బొజ్జ పెంచలయ్య, 12వ వార్డు అభ్యర్థిగా నల్లగళ్ల విమల, 9వ వార్డు అభ్యర్థిగా మల్లవరం అక్సా రాపూరు సచివాలయంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు. ఆయా వార్డుల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore