Atmakur: క్రీడా పోటీలను ప్రారంభించిన ఆత్మకూరు ఆర్డీవో బి. పావని!
Atmakur: ఆర్డీవో బి. పావని అమరావతి ఛాంపియన్‌షిప్-2026 నియోజకవర్గ స్థాయి క్రీడా ఎంపికలను ప్రారంభించారు, 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
Atmakur: క్రీడా పోటీలను ప్రారంభించిన ఆత్మకూరు ఆర్డీవో బి. పావని!
ఆత్మకూరు: అమరావతి ఛాంపియన్‌షిప్–2026లో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ స్థాయి క్రీడాకారుల ఎంపికలు మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 350 మంది క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మకూరు ఆర్డీవో బి పావని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసి జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. క్రీడాకారులు ప్రతిభ కనబర్చి ఆగస్టు 10, 11, 12 తేదీల్లో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో రాణించి ఆత్మకూరు నియోజకవర్గానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల్లో అథ్లెటిక్స్, వాలీబాల్, యోగా, చెస్, బాస్కెట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్ విభాగాల్లో క్రీడాకారులను ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు అనంతలక్ష్మి, చలపతి, టీడీపీ టౌన్ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, ఎస్‌ఎఫ్‌సీఎస్ చైర్మన్ పరిటాల సత్యం, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి బి.వి. రమణయ్య, జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి థామస్ పీటర్, మర్రిపాడు మండల విద్యాశాఖ అధికారి పచ్చ తిరుపతి, ఎస్‌ఆర్‌జేడీ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, నియోజకవర్గంలోని వ్యాయామ విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




