Chejerla: చేజర్లలో భారీగా ఎర్రచందనం పట్టివేత బొలెరో వాహనం సీజ్!

Chejerla: చేజర్ల మండలం ఆదురుపల్లిలో అటవీశాఖ దాడులు. రూ.12 లక్షల విలువైన 528 కిలోల ఎర్రచందనం దుంగలు స్వాధీనం.

Madhav Goud, Nellore
Updated on: 10 Sept 2026 4:46 PM IST
Chejerla
X

Chejerla: చేజర్లలో భారీగా ఎర్రచందనం పట్టివేత బొలెరో వాహనం సీజ్!

Chejerla: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లిలో బుధవారం రాత్రి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో తనిఖీలు చేపట్టి 20 ఎర్రచందనం కొయ్యలను స్వాధీనం చేసుకున్నారు.

వీటి బరువు 528 కిలోలు ఉన్నట్లు రాపూరు రేంజర్ జ్యోతి ఆనంద్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టుకున్న ఎర్రచందనం విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని, బొలెరో విలువ రూ.లక్ష వరకు ఉంటుందని చెప్పారు.

వాహనంలోని ఇద్దరు వ్యక్తులు పరారయ్యారని తెలిపారు. కేసు నమోదు చేసి పరారైనా వ్యక్తుల కోసం గాలింపు చేస్తున్నట్లు తెలిపారు,చేజర్ల పోలీసుల సహకారంతో అటవీ శాఖ అధికారులు చేపట్టిన చర్యలను రేంజర్ అభినందించారు, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్‌పోస్టుల వద్ద నిఘాను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore