Nellore: 30 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే!

Nellore: కొడవలూరు మండలం తాటాకుల దిన్నెలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 April 2026 8:57 PM IST
Nellore
X

Nellore: 30 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే!

Nellore: కొడవలూరు మండలం తాటాకుల దిన్నే పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్థులు గజమాలతో ఘన స్వాగతం పలికారు.ముందుగా వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన మెటల్ రోడ్డును చింతచెలిక స్మశాన వాటికను ప్రారంభించారు. అనంతరం తాటాకుల దిన్నే జగనన్న కాలనీలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు పూర్తయ్యాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. 30 సంవత్సరాలుగా స్మశాన వాటికకు దారి లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ రోడ్డు నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కాలనీలో ఉన్న వాటర్ ట్యాంక్ శిధిలావస్థలో ఉందని స్థానికులు తెలియజేయడంతో త్వరలో దానికి మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో కొనసాగుతున్నాయని అన్నారు.త్వరలో నెల్లూరులో టిడిపి మహానాడు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story