Nellore: 50 లక్షలతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పునఃనిర్మాణ పనులు ప్రారంభం!

Nellore: నెల్లూరు రూరల్ పరిధిలోని బుజబుజ నెల్లూరులో రూ.50 లక్షలతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయి.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 19 Aug 2026 7:54 PM IST
Nellore
X

Nellore: 50 లక్షలతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పునఃనిర్మాణ పనులు ప్రారంభం!

నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 25వ డివిజన్ బుజబుజ నెల్లూరు నందు 50లక్షల రూపాయలతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పునఃనిర్మాణం పనులను టెంకాయ కొట్టి ప్రారంభించారు స్థానిక కార్పొరేటర్ బద్దెపూడి నరసింహగిరి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 25వ డివిజన్ అభివృద్ధికి 7 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు కేటాయించామని చెప్పారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.. గతంలో ఈ ప్రాంతానికి ప్రజాబాటలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చినప్పుడు, ఈ ప్రాంతంలో వాటర్ ప్లాంట్ సమస్య ఉందని, స్థానిక ప్రజలందరూ చెప్పినప్పుడు వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని వాటర్ ప్లాంట్ రెన్యువేషన్ పనుల కోసం 50 లక్షల రూపాయలను మంజూరు చేయించారని అన్నారు గిరిధర్ రెడ్డి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ లో 857 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి జెన్నీ రమణయ్య, క్లస్టర్ ఇంచార్జ్ కంటే సాయి బాబా, 25వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు శేషు యాదవ్, టీడీపీ నాయకులు మాతంగి కృష్ణ, నగళ్ళ రామకృష్ణ, బ్రహ్మారెడ్డి, పులి నాగేశ్వరరావు, షేక్ కరీముల్లా, సురబత్తిన రవి, పిగిలం సుబ్బయ్య, దొడక రమేష్, గుంటగాని అశోక్, వర్దినేని సురేష్, మోటుపల్లి బాలక్రిష్ణ యాదవ్, షేక్ మాబాషా, షేక్ కరిముల్లా, షేక్ అబ్దుల్లా, షబీర్, షేక్ రఫీ హుస్సేన్, షేక్ షబ్బీర్, అక్కరాల రాజశేఖర్, బద్దెపూడి వెంకటరావు, ముజీర్, మాతంగి నరసింహులు, జయరామరాజు, సి.హెచ్.మహేంద్ర నాయుడు, చాన్ భాష, సత్తార్ భాయ్ , షేక్ నాగూర్ బి, బండారి రేవతి, షేక్ గుల్జార్, పి. లక్ష్మి, కామేశ్వరి, బి. సుమతి, జనసేన నాయకులు కుడుముల సురేష్, బీజేపీ నాయకులు గుంటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story