Rapur: రాపూరులో డ్రైనేజీ సమస్యతో ప్రజల అవస్థలు.. ఎంపీడీవోకు వినతి!

Rapur: నెల్లూరు జిల్లా రాపూరు తూర్పు అగర్తకర్త ప్రాంతంలో మురుగునీటి నిల్వతో కాలనీవాసుల ఇబ్బందులు. ఎంపీడీవో వసుంధరమ్మకు అర్జీ సమర్పణ.

Yellayya, Nellore
Published on: 21 Sept 2026 3:54 PM IST
Rapur
X

Rapur: రాపూరులో డ్రైనేజీ సమస్యతో ప్రజల అవస్థలు.. ఎంపీడీవోకు వినతి!

Rapur: నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని తూర్పు అగర్తకర్త ప్రాంతంలో డ్రైనేజీ సమస్యతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు సీసీ రోడ్డుపై రోజుల తరబడి నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు మురుగునీటి మధ్య నుంచే రాకపోకలు సాగించాల్సి వస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమల బెడద పెరిగి, అనారోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితి ఉందని తెలిపారు.

సమస్యకు శాశ్వత పరిష్కారంగా రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రైనేజీ కాలువలు నిర్మించాలని కోరుతూ సోమవారం రాపూరు ఎంపీడీవో వసుంధరమ్మకు కాలనీవాసులు అర్జీ సమర్పించారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.

Yellayya, Nellore

Yellayya, Nellore