Nellore: సమస్యల పరిష్కారంపై నెల్లూరు కలెక్టర్ ఫోకస్!
Nellore: నెల్లూరు కలెక్టరేట్ ప్రజా విజ్ఞప్తుల వేదికలో రెవెన్యూ సమస్యల వెల్లువ. భూ సమస్యలు, రికార్డుల్లో తారుమారుపై కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ఫిర్యాదుల వెల్లువ.
Nellore: సమస్యల పరిష్కారంపై నెల్లూరు కలెక్టర్ ఫోకస్!
నెల్లూరు: రెవెన్యూ సమస్యలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఓవైపు జిల్లా కలెక్టర్ నెలకు ఓ గ్రామం, ఆ గ్రామంలో నాలుగు రోజులు విలేజి విజిట్ అంటూ.. ప్రత్యేక కార్యక్రమాలను రూపకల్పన చేసి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నప్పటికీ.. సమస్యలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.
ముఖ్యంగా రెవెన్యూ వ్యవహారాలలో మండల స్థాయి అధికారులు చేస్తున్న కొన్ని తప్పిదాలు, బాధ్యతా రాహిత్యం, పక్షపాత ధోరణి, రెవెన్యూ సమస్యలను కొండవీటి చేంతాడుల మార్చేస్తోంది.. పొలం బాట విషయాల నుంచి, గట్లు , రెవెన్యూ రికార్డుల్లో పేర్లు తారుమారు, ఆన్లైన్లో తప్పిదాలు, అడంగులలో ఇష్టానుసారంగా, కంప్యూటర్ ఆపరేటర్ల అవినీతి దందా, వెరసి సమస్యల చిట్టా పెరిగిపోతుంది.
మారుమూల పల్లె నుంచి ప్రతి సోమవారం బాధితులు నేరుగా జిల్లా ఉన్నతాధికారులకు, తమ సమస్యలను పరిష్కరించండి మహా ప్రభో అంటూ.. ప్రజా విజ్ఞప్తుల వేదిక నుంచి వేడుకుంటున్నా. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం, ఆ సమస్యలను ఎక్కడేసిన గొంగళి అక్కడే అతని రీతిలో నిలిపివేస్తోంది.
ఫలితంగా జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక గ్రీవెన్స్ లను ఏర్పాటు చేస్తున్నప్పటిక.. రెవెన్యూ సమస్యల్లో పురోగతి మాత్రం అంతంత మాత్రమే ఉంది.. మరోవైపు ఉపాధి హామీల్లో జరిగే అక్రమాలు, వ్యక్తిగత పెన్షన్లు, గృహ నిర్మాణాల మంజూరిలోనూ. మండల స్థాయి, గ్రామస్థాయి అధికారుల నిర్లక్ష్యం, ప్రతి సోమవారం జిల్లా కేంద్రాన్ని అర్జీలు దారులతో ముంచెత్తుతోంది.
ప్రజా విజ్ఞప్తులకు వేదికగా ఉన్న జిల్లా కలెక్టరేట్ లోని, తిక్కన ప్రాంగణం అర్జీదారులతో క్రిక్కిరిసిపోతోంది. కలెక్టరేట్ లోని, తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, తెలుగు గంగ ప్రత్యేక అధికారులు కేశవర్ధన్ రెడ్డి, వంశీ కృష్ణా, ఐటిడిఏ పిఓ శ్రీనివాసరావు, మెప్మా పీడీ కిరణ్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగ శేఖర్ లు అర్జీలను స్వీకరించారు. మొత్తం వచ్చిన అర్జీలలో 3వంతులు రెవెన్యూ కు సంబంధించినవి కావడంతో సంబంధిత ఉన్నతాధికారులతో.. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చర్చిస్తున్నారు.
ఈ స్థాయిలో రెవెన్యూ సమస్యలు పేరుకు పోవడానికి గల కారణాల పైన నివేదిక అందజేయాలని, అధికారులకు సూచనలు చేశారు.. మొత్తంగా ప్రజా విజ్ఞప్తుల వేదిక లో అత్యధిక భాగం రెవెన్యూ సమస్యలు కావడంతో , జిల్లా అధికారులు వాటి పరిష్కారం పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు.




