Vinjamuru: వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, బైక్ ఎదురెదురుగా ఢీ!

Vinjamuru: నెల్లూరు జిల్లా వింజమూరు సమీపంలో 167BG జాతీయ రహదారిపై లారీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఆత్మకూరుకు చెందిన యువకుడు వినయ్ కుమార్ (21) తీవ్రంగా గాయపడ్డాడు

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 July 2026 10:39 PM IST
Vinjamuru
X

Vinjamuru: వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, బైక్ ఎదురెదురుగా ఢీ!

వింజమూరు: నెల్లూరు జిల్లా వింజమూరు సమీపంలోని 167BGవ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీ, దుత్తలూరు నుంచి కావలి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వింజమూరు సమీపంలో ఎదురెదురుగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఆత్మకూరుకు చెందిన వినయ్ కుమార్ (21) తీవ్రంగా గాయపడ్డాడు.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ సహాయంతో గాయపడిన యువకుడిని వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story