Nellore: వేమిరెడ్డిని విమర్శిస్తే హీరో కారు అనిల్‌పై రూప్ కుమార్ ఫైర్!

Nellore: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 31 Aug 2026 7:56 AM IST
Nellore
X

Nellore: వేమిరెడ్డిని విమర్శిస్తే హీరో కారు అనిల్‌పై రూప్ కుమార్ ఫైర్!

Nellore: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైదాపురంలో మైనింగ్ కు మైనింగ్ లో అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ మంత్రి వైసిపి నేత డాక్టర్ కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు, నెల్లూరు డిప్యూటీ మేయర్ టిడిపి నేత రూప్ కుమార్ యాదవ్. వేమిరెడ్డిని విమర్శిస్తే రాజకీయ లబ్ది పొందవచ్చు అనే దుర్బుద్ధితో అనిల్ మాట్లాడుతున్నారంటూ రూప్ కుమార్ యాదవ్ విమర్శించారు. గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా అనిల్ కుమార్ చేసిన దారుణాలు ఏంటో, సైదాపురం మండలంలో ఎవరిని అడిగిన చెబుతారని, రూప్ కుమార్ అన్నారు.

రాజకీయాలు,ధార్మిక సేవా కార్యక్రమాలతో మచ్చలేని నాయకుడుగా చలామణి అవుతున్న ఎంపీ వేమిరెడ్డిని విమర్శిస్తే హీరో అయిపోతానని అనిల్ కుమార్ కలలు కంటున్నారని రూప్ కుమార్ అన్నారు. వేమిరెడ్డి దెబ్బకు ఇప్పటికే రాజకీయంగా అనిల్ కుమార్ పతనమైన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ రాజకీయాల గురించి మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డొస్తుందని లేకుంటే పుట్టుపూర్వోత్తరాలను బయట పెట్టగలరని రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story