Nellore: నెల్లూరు దర్గా వద్ద హైడ్రామా తహసిల్దార్‌ను అడ్డుకున్న పోలీసులు!

Nellore: నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ బందోబస్తులో పోలీసుల అతి శృతిమించింది.

V. Narasimhulu, Nellore
Published on: 27 Jun 2026 9:53 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు దర్గా వద్ద హైడ్రామా తహసిల్దార్‌ను అడ్డుకున్న పోలీసులు!

నెల్లూరు: నెల్లూరు బారా షాహీద్ దర్గా బందోబస్తులో.. పోలీసుల అతి శృతిమించింది. సగటు భక్తులతో దురుసుగా ప్రవర్తించే కొందరు.. ఇవాళ ఏకంగా తహసిల్దార్ తో పాటు, వారి సిబ్బందిని సహా అధికారులను దర్గా ప్రధాన గేటు వద్ద అటకాయించారు. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ జరుగుతున్న ప్రాంగణంలోనే.. నెల్లూరు రూరల్ తహసిల్దార్ కార్యాలయం ఉంది. విధి నిర్వహణలో తహసిల్దార్ తో పాటు డిప్యూటీ తాసిల్దార్ మిగిలినటువంటి అధికారులు తమ వాహనాల్లో కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఇద్దరు స్త్రీలను అడ్డుకున్నారు.

తాము తహసిల్దార్ రెవెన్యూ సిబ్బంది అని చెబుతున్నప్పటికీ, ఏమాత్రం పోలీసులు లెక్కచేయలేదు. దీంతో తహసిల్దార్ కార్యాలయం డీటీలకు సీఐలకు మధ్య, తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ కార్యాలయం విధులకు వెళ్లేందుకు పోలీసులు అడ్డుకుంటున్నారంటూ.. రెవెన్యూ అధికారులు నిరసన వ్యక్తం చేశారు.. తాసిల్దార్ కార్యాలయంలోని సిబ్బంది మొత్తం, గేటు వద్దకు వచ్చి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు.

దీనితో సమాచారం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. అదనపు ఎస్పీ దీక్ష, ఇరువర్గాల అధికారులను.. పోలీస్ గెస్ట్ హౌస్ వద్దకు తీసుకెళ్లి సమన్వయపరిచారు. దీంతో రెవెన్యూ పోలీసుల మధ్య వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. భద్రత వ్యవహారాల్లో పోలీసులు కఠినంగా ఉన్నప్పటికీ, నేరుగా తహసిల్దార్ కార్యాలయం అధికారులపైనే దురుసుగా వ్యవహరించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story