Nellore: కోవూరులో సీఎంఆర్‌ఎఫ్ భరోసా: రూ. 8.47 కోట్ల సహాయం

Nellore: నెల్లూరులో 68 మంది లబ్ధిదారులకు రూ. 69 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పంపిణీ చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 30 April 2026 10:00 PM IST
Nellore
X

Nellore: కోవూరులో సీఎంఆర్‌ఎఫ్ భరోసా: రూ. 8.47 కోట్ల సహాయం

Nellore: సీఎంఆర్‌ఎఫ్‌ నిధులతో రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్య రక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం నగరంలోని విపిఆర్‌ క్యాంపు కార్యాలయంలో 68 మంది లబ్ధిదారులకు 69 లక్షల విలువ చేసే చెక్కులను అందజేశారు. ఇందులో ఎంపీ పరిధిలో 7 మందికి 5 లక్షలు, ఎమ్మెల్యే పరిధిలో 61 మందికి 64 లక్షలు అందించారు. ఎంపీ, ఎమ్మెల్యే పరిధిలో ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల విలువైన చెక్కులు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ... పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయల సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు ఇస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి చంద్రబాబు నాయుడు లాంటి మానవతావాది ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజల అదృష్టంగా అభివర్ణించారు. పేద కుటుంబాలలో ఎవరికైనా పెద్ద జబ్బు చేసి ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతే నేనున్నానంటూ CMRF ద్వారా ఆదుకుంటున్నారని చెప్పారు. 23 నెలల కాలంలోనే కోవూరు నియోజకవర్గంలో 804 మంది బాధితులకు 8.47 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందచేశామన్నారు. పేదల గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియచేసారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story