Atmakur: ఆర్టీసీ ఉద్యోగులు కుటుంబాల కోసం రెండు రోజుల పాటు ఉచిత వైద్య!
Atmakur: ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు, ప్రయాణికుల కోసం రెండు రోజుల ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభమైంది.
Atmakur: ఆర్టీసీ ఉద్యోగులు కుటుంబాల కోసం రెండు రోజుల పాటు ఉచిత వైద్య!
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో ఉద్యోగులకు ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాలల వైద్యులు ఇందులో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయన వైద్యులను శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ప్రభుత్వంలో భాగమే అయినా ఇక్కడి ఈ వ్యవస్థ వాటికి భిన్నంగా ఉంటుందని తెలిపారు.వారి పనితీరు వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయని తెలిపారు అందువల్ల వారికి మానసికంగా శారీరకంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
ఆత్మకూరు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ డిపో మేనేజర్ శివ కేస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ ఉచిత వైద్య శిబిరానికి శిబిరంలో నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్ కు చెందిన ఎముకలు నర్మల వైద్య నిపుణులు తోపాటు ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు ఆయుష్ పరిధిలోని యునాని ఆయుర్వేదం హోమియోపతి వంటి విభాగాల వైద్యులు పాల్గొని ఉచితంగా వైద్య సేవలు అందించారు మందులు పంపిణీ చేశారు.
తమ ఉద్యోగుల కోసం జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి చొరవ చూపడం పై స్థానిక డిఎం శివకేష్ యాదవ్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఈ క్యాంపు రెండు రోజులపాటు నిర్వహిస్తామని తెలిపారు ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాల అత్యవసర విభాగం వైద్య నిపుణులు డాక్టర్ ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది అన్నారు రెండు రోజులపాటు సాయంత్రం వరకు నిర్వహించే ఈ శిబిరంలో ఆర్టీసీ ఉద్యోగులతో పాటు వారి కుటుంబీకులు ప్రయాణికులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ రాజ్ కుమార్ సూపర్వైజర్లు ఇతర అధికారులు కార్మికులు సిబ్బంది పాల్గొన్నారు.




