Nellore: ఎన్నికలు లేని వేళ పార్టీలకు అతీతంగా రూరల్ అభివృద్ధి కోటంరెడ్డి
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ. 60 కోట్ల నిధులతో 97 అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
Nellore: ఎన్నికలు లేని వేళ పార్టీలకు అతీతంగా రూరల్ అభివృద్ధి కోటంరెడ్డి
నెల్లూరు: నెల్లూరు రూరల్ లో 60 కోట్లతో 97 పనులు జరుగుతున్నాయని,48 కిలో మీటర్ల పొడువునా డ్రైన్ నిర్మాణం చేపడుతున్నామని, ఎన్నికలు లేనివేళ పార్టీలకు అతీతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి.నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్, కోడూరుపాడు కల్తీ కాలనీలో 80 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి.
పొదలకూరు రోడ్డు - గాంధీ నగర్ రోడ్డు తరహాలో కొత్త కాలువ సెంటర్ లో త్వరలో సెంట్రల్ లైటింగ్ ను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతామని చెప్పారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.ఈ వయసులో కూడా రాష్ట్రం కోసం ఇంత కష్టం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రజలందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
నెల్లూరు రూరల్ అభివృద్ధికి అన్నిరకాలుగా సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ కి, మంత్రులు నారాయణ కి, ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర కి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలపక్షాన ప్రత్యేక దన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ కుడుముల చిరంజీవి, కో క్లస్టర్ ఇంచార్జ్ తమ్మి శ్రీనివాసులు, కోడూరుపాడు పి.ఏ.సి.ఎస్. చైర్మన్ గంగి జయరామి రెడ్డి, 1వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు జావీద్, ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఛైర్మెన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్, టీడీపీ నాయకులు యనమల శ్రీహరి యాదవ్, యనమల శేషు యాదవ్, తమ్మి శ్రీనివాసులు, దొంతు విజయ్ కుమార్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.




