Nellore: రైతు సంఘం నాయకుల అక్రమ హౌస్ అరెస్టులపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
Nellore: నెల్లూరు జిల్లాలో పొగాకు రైతు నాయకులు మూలి వెంగయ్య, లక్కు ప్రసాద్ ల అక్రమ హౌస్ అరెస్టులను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.
Nellore: రైతు సంఘం నాయకుల అక్రమ హౌస్ అరెస్టులపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
నెల్లూరు: పొగాకు కనీసం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్లు నిధులు ఇచ్చి ఎస్టిసి ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని, పొగాకు రైతులు ఆదుకోవాలని తదితర డిమాండ్స్ తో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పొగాకు రైతులు చేస్తున్న ఆందోళనను నీరుగార్చేందుకు ప్రభుత్వం రైతు సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి లక్కు ప్రసాద్, జిల్లా నాయకులు లక్ష్మీపతి తదితరులను ముందస్తు గృహ నిర్బంధం చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.
ఒకపక్క ముఖ్యమంత్రి గారు మాది రైతు ప్రభుత్వం అని ప్రకటిస్తుండగా కూటమి ప్రభుత్వంలోని పోలీసులు రైతులను, రైతు నాయకులను అక్రమంగా గృహ నిర్బంధం చేయడం ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నాము.
ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత నిరసనలు చేయడం పౌరుల హక్కు అనే సుప్రీంకోర్టు ఒక వైపు ప్రకటిస్తుంటే మరోవైపు దానికి భిన్నంగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లా పోలీస్ అధికారులు రైతు నాయకులను ముందస్తు అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.




