Saidapuram: సైదాపురంలో ఎంపీటీసీ పోరు టై చెరో 6 స్థానాల్లో టీడీపీ, వైసీపీ విజయం!

Saidapuram: నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో ఎంపీటీసీ ఎన్నికల టై. చెరో 6 స్థానాల్లో విజయం సాధించిన టీడీపీ, వైసీపీ. జడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకున్న వైసీపీ.

Yellayya, Nellore
Published on: 8 Nov 2026 8:20 AM IST
Saidapuram
X

Saidapuram: సైదాపురంలో ఎంపీటీసీ పోరు టై చెరో 6 స్థానాల్లో టీడీపీ, వైసీపీ విజయం!

Saidapuram: నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. మండలంలోని మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇరు పార్టీలు చెరో ఆరు స్థానాలను కైవసం చేసుకుని సమాన బలాన్ని చాటుకున్నాయి.

విజయాల వివరాల్లోకి వెళితే కలిచేడు, తురుమెర్ల, తలుపూరు, ఊటుకూరు, రామసాగరం, మర్లపూడి ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. గిద్దలూరు, సైదాపురం, పాలూరు, చాగనం, చీకువోలు, అనంతమడుగు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు.

మొత్తం 12 స్థానాల్లో టీడీపీ ఆరు, వైసీపీ ఆరు స్థానాలను దక్కించుకోవడంతో సైదాపురం మండలంలో ఇరు పార్టీల మధ్య సమాన పోటీ నెలకొంది. మరోవైపు జడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో వైసీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ఎంపీటీసీల్లో సమాన బలం.. జడ్పీటీసీలో వైసీపీ పైచేయి.. సైదాపురం మండల ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.

Yellayya, Nellore

Yellayya, Nellore