Nellore: సైదాపురంలో హెల్మెట్ వినియోగంపై ఎస్సై దుర్గాప్రసాద్ అవగాహన!
Nellore: ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి: సైదాపురం ఎస్సై దుర్గాప్రసాద్. ప్రధాన సెంటర్‌లో బైకర్లకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన, కౌన్సిలింగ్.
Nellore: సైదాపురంలో హెల్మెట్ వినియోగంపై ఎస్సై దుర్గాప్రసాద్ అవగాహన!
నెల్లూరు: ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించడం ద్వారానే తమ ప్రాణాలను కాపాడుకోగలరని నెల్లూరు జిల్లా సైదాపురం మండల ఎస్సై పేర్కొన్నారు. సైదాపురం ప్రధాన సెంటర్ నందు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ మరియు రోడ్డు భద్రతా నియమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మరణాల్లో అత్యధికం తలకు తీవ్ర గాయాలు కావడం వల్లే జరుగుతున్నాయని, నాణ్యమైన హెల్మెట్ వాడటం వల్ల ప్రమాద తీవ్రత తగ్గి ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని తెలిపారు...హెల్మెట్ ధరించడం పోలీసుల జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదని, తమ కుటుంబాల భద్రత కోసమని వాహనదారులు గుర్తించాలని సూచించారు...మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు.
కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించి క్రమశిక్షణతో వాహనాలు నడుపుతున్న పలువురు వాహనదారులను ఎస్సై అభినందించగా, హెల్మెట్ లేని వారికి రోడ్డు భద్రతపై కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, వాహనదారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.




