Nellore: శిశు మందిర్ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగ్‌ల పంపిణీ!

Nellore: మైలు సెంటర్‌లోని 'శిశు మందిర్ యూపీ పాఠశాల' విద్యార్థులకు జిల్లా సామాజిక సామరస్యత వేదిక ఆధ్వర్యంలో ఉచితంగా స్కూల్ బ్యాగ్‌లు పంపిణీ చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 10 Aug 2026 8:25 PM IST
Nellore
X

Nellore: శిశు మందిర్ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగ్‌ల పంపిణీ!

నెల్లూరు: ఈరోజు నెల్లూరు రూరల్ నవలాకుల గార్డెన్ మూడవ మైలు సెంటర్లోని "శిశు మందిర్ యూపీ పాఠశాలలో" 4,5, 6, 7 తరగతులలోని విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు వారికి నెల్లూరు జిల్లా సామాజిక సామరస్యత వేదిక ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ మురళి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు చదువుపై ఆధారపడి ఉంటుందని, విద్యార్థులు అందరూ అన్ని రంగాలలో రాణించి మంచి భవిష్యత్తును పొందగలరని, తద్వారా దేశం కూడా అభివృద్ధిలో నడవగల దని, అందువల్ల ప్రతి విద్యార్థి మొక్కవోని దీక్షతో చదువు కొనసాగించి, పాఠశాలకు మంచి పేరు ను సంపాదించి పెట్టగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమం అనంతరం ఎంఈఓ ని పాఠశాల తరపున సన్మానించారు. పై కార్యక్రమంలో మోవిడి శ్రీనివాసులు , పోలయ్య, కృష్ణమూర్తి, దాసరి రాజేంద్ర, శ్రీనివాస్ మూర్తి, రాధాకృష్ణ, ప్రధాన ఆచార్యులు దార్ల శ్రీనివాసులు కేశవులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story