Sangam: సంగం విద్యార్థులకు నేల ఆరోగ్యంపై అవగాహన

Sangam: సంగం జెడ్పీ హైస్కూల్, అంబేద్కర్ గురుకులంలో నేల ఆరోగ్యంపై అవగాహన సదస్సు. మట్టి నమూనాల సేకరణ, సేంద్రియ ఎరువుల వాడకంపై వ్యవసాయ అధికారుల వివరణ.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 17 July 2026 7:19 PM IST
Sangam
X

Sangam: సంగం విద్యార్థులకు నేల ఆరోగ్యంపై అవగాహన

సంగం: నెల్లూరు జిల్లా సంగం ప్రభుత్వ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల,అంబేద్కర్ గురుకులం బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఈరోజు స్కూల్ సాయిల్ హెల్త్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

నెల్లూరు కెవికె భూసార శాస్త్రవేత్త పి.అనూష మట్టి నమూనాల సేకరణ వాటి ప్రాధాన్యత సమశ్యాత్మక భూములు గురించి వివరించారు.

నెల్లూరు సాయిల్ టెస్ట్ లేబొరేటరీ వ్యవసాయ అధికారి మాట్లాడుతూ మట్టి నమూనాల సేకరణ, పరీక్ష, ఎరువుల యాజమాన్యం, సూక్ష్మ, సూక్ష్మ పోషకాల వినియోగం తదితర వాటిపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం ఎ డి ఎ వి. దేవసేన రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో , వ్యవసాయ విస్తరణ అధికారి మనోహర్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story