Nellore: సంగం బ్యారేజీ వద్ద రొట్టెల పండుగ భక్తుల రద్దీ.. అలర్ట్ అయిన పోలీసులు!
Nellore: నెల్లూరులో జరుగుతున్న ప్రసిద్ధ బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ ముగించుకుని తిరుగు ప్రయాణమైన భక్తులు సంగం బ్యారేజికి భారీగా చేరుకుంటున్నారు.
Nellore: నెల్లూరు లో జరుగుతున్న బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా తిరుగు ప్రయాణంలో సంగం బ్యారేజికి భారీగా చేరుకుంటున్న భక్తుల భద్రత కోసం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.సీఐ శ్రీనివాస రెడ్డి,ఎస్సై భోజ్యా నాయక్ ఆధ్వర్యంలో బ్యారేజి వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, బ్యారేజీ నీటిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ దిగవద్దని భక్తులకు స్పష్టంగా సూచించారు.
బ్యారేజీ పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తూ ప్రతి కదలికపై పోలీసులు అప్రమత్తంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజల ప్రాణ భద్రతే తమ ప్రధాన బాధ్యతగా భావించి ముందస్తు జాగ్రత్తలను మరింత పటిష్టం చేశామని అధికా రులు తెలిపారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులు పోలీసుల సూ చనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న పోలీసు యంత్రాంగం చర్యలు భక్తుల్లో భద్రతపై విశ్వాసాన్ని పెంచుతున్నాయి.




