Nellore: షూటింగ్ బాల్ పోటీల్లో నెల్లూరు అమ్మాయిల అద్భుత ప్రతిభ!
Nellore: సంగం ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహ విద్యార్థినులు అర్చన, అపర్ణ పులివెందులలో జరిగిన రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు.
Nellore: షూటింగ్ బాల్ పోటీల్లో నెల్లూరు అమ్మాయిల అద్భుత ప్రతిభ!
నెల్లూరు జిల్లా: సంగం లోని గవర్నమెంట్ బీసీ బాలికల వసతి గృహానికి చెందిన విద్యార్థినులు షూటింగ్ బాల్ క్రీడలో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించారు.వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదువుతున్న బి. అర్చన, మరియు 9వ తరగతి చదువుతున్న కె. అపర్ణలు జిల్లా తరపున ఆడి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
శని, ఆదివారాల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందులలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో వీరు జిల్లా జట్టు తరపున ప్రాతినిధ్యం వహించారు.ఈ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వీరు, స్టేట్ సెకండ్ ప్లేస్ సాధించడమే కాకుండా గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు.
రాష్ట్ర స్థాయిలో రాణించి, పతకాలు సాధించిన విద్యార్థినులను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎమ్. మల్లేశ్వరి ప్రత్యేకంగా అభినందించారు. వసతి గృహ విద్యార్థినులు క్రీడల్లో ఇంతటి ప్రతిభ చూపడం పట్ల స్థానికులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




