Sangam: సంగం ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాల గడువు పొడిగింపు!
Sangam: సంగం ప్రభుత్వ ఐటీఐలో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ సీట్ల భర్తీకి దరఖాస్తుల గడువు పొడిగింపు. ఆగస్టు 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుకు అవకాశం.
Sangam: సంగం ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాల గడువు పొడిగింపు!
సంగం: నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ), సంగంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ ట్రేడ్లలో మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండో విడత దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ప్రిన్సిపాల్ పి. విజయ తెలిపారు.
పదో తరగతి ఉత్తీర్ణులైన ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ రాత్రి 11:55 గంటలలోపు itiadmissions.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆగస్టు 11వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు తమ సమీప ప్రభుత్వ ఐటీఐలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో ధ్రువీకరణ (వెరిఫికేషన్) పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే సంగం ప్రభుత్వ ఐటీఐలో చేరదలచిన అభ్యర్థులు ఆగస్టు 12వ తేదీన ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ప్రిన్సిపాల్ పి. విజయ కోరారు.




