Nellore: సంగం గురుకుల పాఠశాలలో నులిపురుగుల నివారణ దినోత్సవం!

Nellore: నెల్లూరు జిల్లా సంగం గురుకుల పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులకు వైద్యాధికారి అశోక్ కుమార్ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 25 Sept 2026 2:48 PM IST
Nellore
X

Nellore: సంగం గురుకుల పాఠశాలలో నులిపురుగుల నివారణ దినోత్సవం!

Nellore: నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసి, నులిపురుగుల నివారణ, మాత్రల వినియోగం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.సంగం మండల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో కలిపి మొత్తం 119 కేంద్రాల్లో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మండలంలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల 7,468 మంది పిల్లలను లక్ష్యంగా గుర్తించి, వారికి నులిపురుగుల నివారణ మాత్రలను అందిస్తున్నట్లు వెల్లడించారు.పిల్లలు మధ్యాహ్న భోజనం అనంతరం ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల మాత్రను బాగా నమిలి మింగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో 100 శాతం మంది పిల్లలకు మాత్రలు అందించడమే లక్ష్యంగా వైద్య, విద్యా సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.ఈ రోజు మాత్రలు వేసుకోలేకపోయిన లేదా వివిధ కారణాలతో గైర్హాజరైన పిల్లల కోసం వచ్చే నెల 5వ తేదీన మిగిలిన వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందజేసి కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని డాక్టర్ అశోక్ కుమార్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)